నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే

Joshua Shaik
394 Views

నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ – నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య

1. ప్రభు యేసు దైవమా – చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే – బలమైనదీ
ప్రియమార నీ స్వరం – వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే – వెలుగైనదీ
నీ సన్నిధానమే – సంతోష గానమై
నీ నామ ధ్యానమే – సీయోను మార్గమై
భయపడను నేనిక – నీ ప్రేమ సాక్షిగా
గానమై – రాగమై
అనుదినము నిన్నే – ఆరాధింతును
కలకాలం నీలో – ఆనందింతును

2. కొనియాడి పాడనా – మనసార వేడనా
నీ ప్రేమ మాటలే – విలువైనవీ
ఎనలేని బాటలో – వెనువెంట తోడుగా
నా యందు నీ కృప – ఘనమైనదీ
నా నీతి సూర్యుడా – నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో – నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే – నాలోని ఆశగా
ప్రాణమా – జీవమా
అనుదినము నిన్నే – ఆరాధింతును
కలకాలం నీలో – ఆనందింతును

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account