Chorantians Bible Quiz
View Allనీ సన్నిధిలో ఆనందమే
Joshua Shaikనీ సన్నిధిలో ఆనందమే – నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా – పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా
మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా
నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా
కృప చూపుము దేవా – దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా
నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు
విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా
దరి చేర్చు ప్రభువా – పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా