వెళ్లిపోవే గతమా చెల్లుబాటు కావు నీవిక

549 Views

వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం || 2 ||

మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు || 2 ||
రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో || 2 || || వెళ్లిపోవే గతమా ||

ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు || 2 ||
నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా || 2 || || వెళ్లిపోవే గతమా ||

మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు || 2 ||
ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున || 2 || || వెళ్లిపోవే గతమా ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account