నీ నామమే ఎద కొలిచెదను

196 Views

నీ నామమే ఎద కొలిచెదను
నీ వాక్యమునే సదా తలచెదను (2)
సైన్యములకధిపతియగు దేవా
ఆది దేవుడవయిన యెహోవా (2)      ||నీ నామమే||

దోష రహితుడ – సృష్టి కారుడ
నేరమెంచని నిర్ణయకుడా
సిలువ దరుడ – మరణ విజయుడ
లోక రక్షక యేసు నాథుడా (2)      ||సైన్యము||

నిన్ను మరచిన – మిగులు శూన్యము
నీతో అణకువ పెంచు జ్ఞానము
నాదు లోకము – బహు కలవరము
నీదు వాక్యము తెలుపు మార్గము (2)      ||సైన్యము||

క్షణము వీడని – నీడ నీవని
నమ్మి నిరతము నిన్ను వేడెద
నీదు పాత్రగ – యాత్ర సాగెద
నీదు ఘనతను ఎలిగి చాటెద (2)      ||సైన్యము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account