నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా

176 Views

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)

నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా (2)
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)
విలువైనదేది నీకన్నా          ||యేసయ్యా||

నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా (2)
నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)
పరిశుద్ధాత్మను ప్రోక్షించు          ||యేసయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account