నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము

132 Views

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము
నన్ను కలిసిన వరము (2)
స్తుతి గాన సంపద నిన్ను చేరాలని
నా దీన మనస్సు నీవే చూడాలని
ప్రయాసతో ప్రయాణమైతిని       ||నీవే||

నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు
నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)
ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం
నా కొరకే పంపావయ్యా
ఏ చోటనైనా – ఏ పల్లెనైనా
నీ పలుకే బంగారమాయెనయా        ||నీవే||

నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా
సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2)
దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన
కనిపెట్టి చూసావయ్యా
నా దుఃఖ భారం – నా శాప భారం
నీలోనే కరగాలయ్యా          ||నీవే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account