నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి

160 Views

నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2)
నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2)
ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2)      ||నేను||

నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2)
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2)
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2)
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2)      ||ఇదియే||

ఆదాము పాపము నాలో వసియించియుండగా (2)
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2)
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2)
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2)      ||ఇదియే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account