పరలోకమే నా అంతఃపురం

169 Views

పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||

స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే||

పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account