పలుకలేని నాకు పాట నేర్పినావు

119 Views

పలుకలేని నాకు పాట నేర్పినావు
చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు
మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2)
యేసయ్యా స్తోత్రమయా
యేసయ్యా స్తోత్రమయా         ||పలుకలేని||

కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు
నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2)
ప్రతి ఉదయం వేకువనే
ఎదురు చూచు ప్రియుడవు నీవు (2)
ప్రతి క్షణము కాపరివై
కాయుచున్న దేవుడ నీవు (2)         ||యేసయ్యా||

అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది
వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2)
ప్రతి పగలు మేఘమై
నీడనిచ్చుఁ దేవుడ నీవు (2)
ప్రతి రాత్రి దీపమై
వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2)         ||యేసయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account