వచ్చినాడు రారాజుగా

Joshua Gariki
313 Views

వచ్చినాడు రారాజుగా – (ఇలలో)పుట్టినాడు రక్షకునిగా//2//
దిగివచ్చినాడు దీనునుగా //2//
జన్మించినాడు పరిశుద్ధినిగా….

పండుగ- క్రిస్మస్ పండుగ -అందరి పండుగ –
సంబరాలవేడుక //2// వచ్చినాడు//

1. లోకపాపములు మోసిన దేవుడు
మరణపు కోరలను విరిచిన విజయుడు//2//
ప్రేమించి – కరుణించి – రక్షించి – నిను నడిపించే//2//
దయగల దేవుడు పుట్టాడు- కరుణగల రక్షకుడుదయించాడు//2//
పండుగ- క్రిస్మస్ పండుగ- అందరి పండుగ- సంబరాల వేడుక//2// వచ్చినాడు//

2. చీకటి బ్రతుకులలో వెలుగును ఇచ్చుటకు
రక్షణ మనకిచ్చి పరముకు చేర్చుటకు//2//
ప్రేమించి- కరుణించి- రక్షించి- నినునడిపించే//2//
దయగల దేవుడు పుట్టాడు- కరుణగల రక్షకుడుదయించాడు//2/
పండుగ- క్రిస్మస్ పండుగ- అందరి పండుగ- సంబరాల వేడుక//2// వచ్చినాడు//

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account