ప్రభు యేసు నా రక్షకా

188 Views

ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)          ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2)             ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2)             ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2)             ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2)                 ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2)          ||ప్రభు యేసు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account