

Adviteeyuda – అద్వితీయుడా
అద్వితీయుడా
— Hosanna Ministriesమదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా
ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా
నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా
విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు – ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
Adviteeyuda
— Hosanna Ministriesజ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి||
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||
Jyothirmayudaa Naa Praana Priyudaa
Jyothirmayudaa Naa Praana Priyudaa
Sthuthi Mahimalu Neeke
Naa Aathmalo Anukshanam
Naa Athishayamu Neeve – Naa Aanandamu Neeve
Naa Aaraadhanaa Neeve (2) ||Jyothi||
Naa Paralokapu Thandri – Vyavasaayakudaa (2)
Nee Thotaloni Draakshaavallitho
Nanu Antu Katti Sthiraparachaavaa (2) ||Jyothi||
Naa Paralokapu Thandri – Naa Manchi Kummari (2)
Neekishtamaina Paathranu Cheya
Nanu Visireyaka Saarepai Unchaavaa (2) ||Jyothi||
Naa Thandri Kumaara – Parishudhdhaathmudaa (2)
Thriyeka Devaa Aadisambhoothudaa
Ninu Nenemani Aaraadhincheda (2) ||Jyothi||
సౌందర్య సీయోనులో
— Hosanna Ministriesబహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
1. పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ – నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
2.ఓటమినీడలో క్షేమములేక – వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు – చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
Soundarya Seeyonulo
— Hosanna Ministriesస్తోత్రగానం
— Hosanna Ministriesఎదో ఆశ నాలో నీతోనే జీవించని_2
యేరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని
మితిలేని ప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే (ఎదో ఆశ నాలో)
1. పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము _2
తీర్చవులే నా కోరిక తెచ్చనులో చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్యా (ఎదో ఆశ నాలో)
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదన_2
ప్రకటింతును నీ శౌర్యము కిర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్యా(ఎదో ఆశ నాలో)
Stotraganam
— Hosanna Ministriesజీవప్రధాతవు
— Hosanna Ministriesజీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ – ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే – మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై – కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి – జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా – నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై – ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి – దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు – విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో – ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
Jeevapradathavu
— Hosanna Ministriesదయాసంకల్పం
— Hosanna Ministriesగగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా “2”
నిన్ను చూడాలని ( నిన్ను చేరాలని “4”)
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది “3”
“గగన”
1.నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది “2”
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను “2”
నీ కౌగిలిలో నేను విశ్రమింతును “2”
“గగన”
2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది “2”
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను “2”
యుగయుగాలు నీతో ఏలెదను “2”
“గగన”
3.నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది “2”
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో “2”
సీయోనులో నీతో నేనుందును “2”
“గగన”
Dayaa Samkalpam
— Hosanna Ministriesదైవ ప్రణాళిక
— Hosanna Ministriesపల్లవి: నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని “2”
అక్షయుడా నీ కల్వరిత్యాగం
అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు
అనురాగ వర్షం కురిపించినావు “2”
¶నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా¶
1.యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి
గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు “2”
నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా
దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా
“నా హృదయ”
2.నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా “2”
ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు దీనమనస్సు
వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
“నా హృదయ”
3.స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన
సంఘముగా నను నిలుపునే నీ యెదుట “2”
సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను
నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా “నా హృదయ”
Daiva Pranalika
— Hosanna Ministriesఅతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము
— Hosanna Ministriesఅతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
Athi Parishudduda
— Hosanna Ministriesశుద్ధిచేసే రక్తం
— Hosanna Ministriesరక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన రక్తం జయం “2”
యేసు రక్తమే జయం జయం జయం “4”
రక్తం జయం యేసు రక్తం జయం “2”
రక్తం రక్తం యేసు రక్తం జయం “5”
“రక్తం”
1.పాపమును కడిగే రక్తం మనస్సాక్షిని శుద్ధిచేసే రక్తం “2”
శిక్షను తప్పించే రక్తం “2”
అమూల్యమైన యేసు రక్తం
“రక్తం”
2.పరిశుద్ధునిగా చేసే రక్తం తండ్రితో సంధి చేసే రక్తం “2”
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం “2”
నిష్కళంకమైన యేసు రక్తం
“రక్తం”
యేసు రక్తము రక్తము రక్తము “2”
ఆ….ఆ….ఆ….ఆ…. “2”
3.నీతిమంతునిగా చేసిన రక్తం నిర్ధోషినిగా మార్చిన రక్తం “2”
నిత్య నిబంధన చేసిన రక్తం “2”
నిత్య జీవమిచ్చు యేసు రక్తం
“రక్తం”
4.క్రయధనమును చెల్లించిన రక్తం బదులు అర్పణలు కోరని రక్తం “2”
నన్ను విమోచించిన రక్తం “2”
క్రొత్త నిబంధన యేసు రక్తం
“రక్తం”













