జీవప్రధాతవు

Hosanna Ministries
2889 Views

జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ – ఏమని పొగడెదను

శుభకరమైన తొలిప్రేమనునే – మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై – కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి – జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా

నేనేమైయున్న నీకృపకాదా – నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై – ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా

మహిమనుధరించిన యోధులతోకలసి – దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు – విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో – ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account