Chorantians Bible Quiz
View Allప్రభుని రాకడ ఈ దినమే
ప్రభుని రాకడ – ఈ దినమే
పరుగులిడి రండి – సుదినమే (2)
పరమునందుండి – మన ప్రభువు
ధరకు నరుగును – పాలనకై (2)
బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని||
సిద్ధులగు వారిన్ – మన యేసు
శుద్ధి జేయునిలన్ – పరమునకై (2)
బుద్ధిహీనులను – శ్రమలచేత
బద్ధులుగ జేయున్ – వేదనతో (2)
బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని||
స్వరముతో వచ్చున్ – అధికారి
మహిమతో మరలున్ – తన దూత (2)
సూర్యచంద్రునిలన్ – తారలతో
జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2)
పగలు రాత్రియగున్ – త్వరపడుము ||ప్రభుని||
మొదట లేతురు – సజీవులై
ప్రభునియందుండు – ఆ మృతులు (2)
మరల అందరము – ఆ ధ్వనితో
పరము జేరుదుము – ధరనుండి (2)
ధన్యులగుదుము – పరికించు ||ప్రభుని||
వెయ్యియేండ్లు – పాలించెదరు
ప్రియుని రాజ్యమున – ప్రియులు (2)
సాయం సమయమున – చేరి
నెమలి కోకిలలు – రాజున్ (2)
పాడి స్తుతించును – ఆ దినము ||ప్రభుని||
గొర్రె మేకలును – ఆ చిరుత
సింహజాతులును – ఒక చోట (2)
భేధము లేక – బరుండి
గరిక మేయును – ఆ వేళ (2)
కలసి మెలగును – భయపడక ||ప్రభుని||
న్యాయ నీతులన్ – మన ప్రభువు
ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2)
సాక్షులుగ నిలుతుం – అందరము
స్వామియేసునకు – ధ్వజమెత్తి (2)
చాటి యేసునకు – ఓ ప్రియుడా ||ప్రభుని||