ప్రార్థన వలనే పయనము

142805 Views

ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం||2||
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

ప్రార్ధనలో నాటునది
పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది
పొందకపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో ప్రాకులాడినది
పతనమవ్వుట అసాధ్యము||2||
ప్రార్ధనలో పదునైనది
పనిచేయ్యకపోవుట అసాధ్యము||2||
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

ప్రార్ధనలో కనీళ్లు
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూలుగునది
మారుగైపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో నలిగితే
నష్టపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో పెనుగులాడితే
పడిపోవుట అసాధ్యము||2||
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account