ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే

34282 Views

నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే

స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
పిండము వలె మోసితివే స్తోత్రం

ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే – (2)
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు – (2) ఎబినేజరు….

అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే – (2)
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు – (2) ఎబినేజరు….

జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము – (2)
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు – (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account