ఎందుకింత ప్రేమ నాపై

706 Views

పల్లవి:
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ
అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
1. గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా?
గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
2. నిరీక్షణే లేక… కలవరము చెందగా
అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
3. ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account