నూతన క్రియలు

Akshaya Praveen
2251 Views

ప: నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా
నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో – 2
నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును – 2 || నూతన ॥

చ: ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు సేవించు వారిని ఘనపరచెదవు – 2
నీ ప్రేమ వర్ణించలేనయా – నీ కృప వివరించలేనయా – 2 ॥ హల్లెలూయ |

చ: నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
మాటయిచ్చి తప్పని వాడవు – వాగ్దానమును స్థిరపరచు వాడవు – 2
నీ సంకల్పము గ్రహింతును – నీ చిత్తమునే జరిగింతును – 2 ॥ హల్లెలూయ ||

చ: తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును పరిశుద్ధాత్మతో నేసాగెదను – పరిశుద్దులతో నేనుండెదను – 2
నాకెంతో భాగ్యమయా – నాకెంతో ధన్యతయా – 2 ॥ హల్లెలూయ |

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account