పాపమెరుగని పావనాత్ముని

165 Views

పాపమెరుగని పావనాత్ముని
పరిహసించుట న్యాయమా (2)
దోషమెరుగని దీన బాంధుని (2)
దోషి చేయుట ధర్మమా – ధర్మమా         ||పాపమెరుగని||

మోయరాని పాప భారము
మోపినారు సిలువపై (2)
గాయమొంది బాధకోర్చి వేదననొంది
ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా       ||పాపమెరుగని||

జీవ జలముల త్రోవ చూపి
బ్రోవ నాత్మల దాహమొందె (2)
చావొంది ఆగమై బలి దానమై
జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా          ||పాపమెరుగని||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account