Chorantians Bible Quiz
View Allప్రాణేశ్వర ప్రభు దైవకుమార
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర||
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర||
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) ||ప్రాణేశ్వర||
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర||
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర||
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||