నేనంటే నీకు అంత ఇష్టమా

Prasanna Kumar
100 Views

పల్లవి: నేనంటే నీకు అంత ఇష్టమా
నాకై మరణించేటంత ఇష్టమా
యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య

1. అన్యాయపు తీర్పు పొందావనాకై
అవహేళనలెన్నో భరియించావా //2//
నాకు న్యాయం చేయుట కొరకై
నా అవమానమును కొట్టివేయుటకై //2// యేసయ్య

2. ముళ్ళ కిరీటమును ధరించావా
కొరడా దెబ్బలనే భరించినావా //2//
జీవ కిరీటము నాకిచ్చుటకు
నా ఘోర వ్యాధిని తొలగించుటకు //2// యేసయ్య

3. సిలువలో మేకులతో వ్రేలాడితివా
నీ చివరి శ్వాసను అర్పించినావా //2//
నా శాపమునంత బాపుట కొరకు
పునరుద్దాన మహిమ నాకిచ్చుటకు //2// యేసయ్య

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account