Chorantians Bible Quiz
View Allగళమెత్తి పాడినా
AR Steevensonగళమెత్తి పాడినా – స్వరమాలపించినా
నీ గానమే – యేసూ నీ కోసమే
నీ ధ్యానమే – యేసూ నీ కోసమే
1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే
కృశియించిపోయే నాలో వసియించినావే
నీ కార్యము వివరించెదన్ – నీ నామము హెచ్చించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా
2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే
గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే
నీలో అతిశయించెదన్ – నీలో ఆనందించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా
3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే
కృపచేత ఆపదనుండి విడిపించినావే
నీ నీతిని వర్ణించెదన్ – నీ ప్రేమను ప్రకటించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా