ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి

Sathish Kumar
196 Views

ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
కన్న వారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై (2)          ||ప్రేమా||

తల్లిదండ్రులు కలలు గని
రెక్కలు ముక్కలు చేసుకొని (2)
రక్తము చెమటగా మార్చుకొని
నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2)         ||కన్న||

ప్రభు ప్రేమను వదులుకొని
ఈ లోక ఆశలు హత్తుకొని (2)
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – (2)
కొన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కోడలికి చేరువై (2)          ||ప్రేమా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account