ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా

155 Views

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account