పోరాటం ఆత్మీయ పోరాటం

117 Views

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account