మరణము నన్నేమి చేయలేదు

190 Views

మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు (2)        ||మరణము||

నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account