మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ

147 Views

మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||

సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       ||ఆరాధనా||

ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       ||ఆరాధనా||

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)       ||ఆరాధనా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account