మంచి దేవుడు నా యేసయ్యా

305 Views

మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనత ప్రభావము నీకే (2)

కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2)         ||మహిమా||

మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2)         ||మహిమా||

జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2)         ||మహిమా||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account