మారని దేవుడవు నీవేనయ్యా

147 Views

మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)         ||మారని||

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)       ||మారని||

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)         ||మరని||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account