యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు

207 Views

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)         ||యెహోవా||

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)        ||యెహోవా నాకు||

దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)         ||యెహోవా నాకు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account