యెహోవా నా బలమా

240 Views

యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం (2)                  ||యెహోవా||

నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2)         ||యెహోవా||

మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2)         ||యెహోవా||

నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)     ||యెహోవా||

పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లన్ (2)             ||యెహోవా||

మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2)       ||యెహోవా||

దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వమునెరిగిన సర్వాధికారి (2)             ||యెహోవా||

నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2)     ||యెహోవా||

యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2)       ||యెహోవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account