యెహోవాను సన్నుతించెదన్

111 Views

యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్ (2)
హల్లెలూయా హల్లెలూయా (2)         ||యెహోవాను||

నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను (2)
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2)
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా (2)
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2)         ||యెహోవాను||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account