యేసు నీ నామామృతము మా

207 Views

యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన           ||యేసు||

వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి          ||యేసు||

పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు         ||యేసు||

అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు      ||యేసు||

అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ
నీ – సుందర కరుణామృతము మా
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన        ||యేసు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account