యేసు నీ వారము – నీవే మా రాజువు

134 Views

యేసు నీ వారము – నీవే మా రాజువు (2)
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2)      ||యేసు||

మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే (2)
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2)      ||యేసు||

ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు
అన్నీ నీవొసగినవే
ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని
మాకోసం నిలిపితివే (2)
ఆద్యంతముల ప్రభువా
ఆరాధింతుము నిన్నే (2)      ||యేసు||

సిలువలో మరణించి – మరణమునే ఓడించి
జయమును పొందితివే
పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి
పరమును ఒసగితివే (2)
మమ్మెంతో ప్రేమించి
మా కొరకు నిలచితివే (2)      ||యేసు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account