యేసు రక్తములో నాకు జయమే జయము

116 Views

యేసు రక్తములో నాకు జయమే జయము
ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)
జయం జయం జయం జయం – నా యేసునిలో

జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2)     ||యేసు రక్తములో||

పాపాలను క్షమియించి – శాపాలను భరియించి
విడుదలను కలిగించే యేసు రక్తము
మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి
పరలోకానికి చేర్చే యేసు రక్తము (2)
అమూల్యమైనది పవిత్రమైనది

ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      ||జయం జయం||

శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి
ఆదరణను కలిగించే యేసు రక్తము
రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి
స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2)
అమూల్యమైనది పవిత్రమైనది

ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      ||జయం జయం||

 

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account