అద్వితీయ సత్య దేవా వందనం

276 Views

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం

అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)
ఆద్యంత రహిత నీకే వందనం – వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

ప్రాణదాత యేసునాథా వందనం – వందనం
ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2)
సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account