Chorantians Bible Quiz
View Allమహదానందమైన నీదు సన్నిధి
Hosanna Ministriesమహదానందమైన నీదు సన్నిధి
ఆపత్కాలమందు దాగు చోటది
మనవులు అన్నియు ఆలకించినా
వినయము గలవారికి ఘనతనిచ్చినా
నీ సింహాసనము స్థాపించుటకు
నీవు కోరుకున్న సన్నిధానము ||2||
ఎంత మధురము నీ ప్రేమ మందిరము
పరవశమే నాకు యేసయ్యా ||2||
|| మహ||
చరణం-1:
విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగా ||2||
పరమందుండి నీవు కరుణ చూపగా
లేత చిగురుపైన
మంచు కురియు రీతిగా ||2||
ప్రేమను చూపి బాహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన ||2||
ప్రేమసాగరా జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును
||మహ||
చరణం-2:
లెక్కించలేని స్తుతులతో నీవు
శాశ్వత కాలము స్తుతినొందెదవు ||2||
మహిమతో నీవు సంచరించగా ఏడు
దీప స్థంబములకు వెలుగు కలుగగా ||2||
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి ||2||
కృపా సాగరా వధువు సంఘమై
నీకోసమే వేచియుందును ||2||
||మహ||
చరణం-3:
సీయోను శిఖరమే నీ సింహాసనము
శుద్ధులు నివసించు మహిమ నగరము ||2||
ఎవరూ పాడలేని క్రొత్త కీర్తన
మధురముగా నీ యెదుట నేను పాడెద ||2||
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను
ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా
నీతోనే రాజ్యమేలేదా ||2||
||మహ||