Chorantians Bible Quiz
View Allస్తుతి పాడుటకే బ్రతికించిన
Hosanna Ministriesస్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై
ఎన్నడు మారదు యేసయ్యా ||2||
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా
ఆరాధించి ఘనపరతును
||స్తుతి||
చరణం-1:
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
ధీర్ఘాయువుతో నను నింపినావు ||2||
నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున-
నూతన బలమిచ్చెను
||స్తుతి||
చరణం-2:
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఃఖదినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు ||2||
నీ దివ్య సంకల్పమే-అవనిలో శుభప్రదమై
నీ నిత్యరాజ్యమునకై-నిరీక్షణ కలిగించెను
||స్తుతి||
చరణం-3:
హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు ||2||
నీ ప్రేమ మాధుర్యమే-నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున-పారెను సెలయేరులై
||స్తుతి||
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంతా
ఆరాధించి ఘనపరతును ||3||
నిన్నే ఆరాధించి ఘనపరతును ||6||