ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో

308 Views

ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)
కన్నీళ్లతో పాదాలు కడిగింది
తన కురులతో పాదాలు తుడిచింది (2)
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)

జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)        ||ఆ భోజన||

సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)        ||ఆ భోజన||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account