ఆకశాన తార ఒకటి వెలసింది

Christmas Songs
245 Views

ఆకశాన తార ఒకటి వెలసింది
ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్         ||ఆకాశాన||

యూద దేశపు బెత్లెహేములో
కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
యూదుల రాజు ఎక్కడని వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని
ఆనందభరితులై యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి        ||ఇదే||

రాత్రివేళలో మంద కాసెడి
కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం
కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట
ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము          ||ఇదే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account