ఆకాశమందు నీవుండగా

252 Views

ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను (2)

శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (2)        ||ఆకాశమందు||

వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (2)        ||ఆకాశమందు||

పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు (2)        ||ఆకాశమందు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account