ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు

242 Views

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు||

మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)      ||ఇశ్రాయేలు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account