ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము

230 Views

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం          ||ఇన్నేళ్లు||

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం      ||ఇన్నేళ్లు||

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం           ||ఇన్నేళ్లు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account