కరుణ చూపించుమా

171 Views

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా (2)       ||కరుణ||

ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2)     ||కరుణగల||

ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)
చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2)     ||కరుణగల||

మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)
నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2)     ||కరుణగల||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account