ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల

184 Views

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)
ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల||

నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల||

ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న (2)
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల||

మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా (2)
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల||

సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు (2)
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account