ఘనమైన నా యేసయ్యా

183 Views

ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2)
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ – కృపా సత్యములను ప్రకటింతును (2)       ||ఘనమైన||

నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2)
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2)
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా (2)
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు (2)
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2)
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account