చిరుగాలి వీచినా ప్రభూ

181 Views

చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నె చాటదా
పెనుగాలి రేగినా ప్రభూ
అది నిన్నె చూపదా

పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే (2)   ||చిరు||

దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మెనో (2)
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే (2)   ||చిరు||

దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెగా (2)
పదే పాడి నీ కృపలన్
నే వివరింతున్ నా యేసువా (2)   ||చిరు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account