ఆరాధించెద నిను మది

Siyonu Geethamulu
173 Views

ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే (2)
జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితము (2)
నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||

నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి (2)
నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)
నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||

పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ (2)
లెక్కింపగజాలని జనమందున (2)
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account