ఆరాధించెదం ఆర్భాటించెదం

252 Views

ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా

యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
మా ప్రార్ధనలు ఆలకించువాడా
స్తుతియాగము చేయు వాడే
నిన్ను మహిమ పరచు వాడు       ||యేసయ్యా||

యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను
అద్భుత జయమును పొందిరి
బెరాకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి       ||యేసయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account