డి.యల్. మూడీ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- డ్వైట్ లైమన్ మూడీ
జన్మస్థలం:- అమెరికాలోని నార్త్ ఫీల్డ్
తల్లిదండ్రులు:- ఎడ్విన్ మోడీ బెడ్స్
భార్య పేరు:- ఎమ్మా రెవెల్
జననము:- 1837 ఫిబ్రవరి 5
మరణం:- 1898 డిసెంబర్ 22
రక్షణానుభవం:- 17 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- గొప్ప ప్రసంగీకులు గా పేరుపొంది కోటిమందికి సువార్త ప్రకటించాడు..

వ్యక్తిగత సాక్ష్యము:- డి.యల్. మూడీ అమెరికాలోని మసాచుసెట్స్ ప్రాంతానికి చెందిన నార్త్ ఫీల్డ్ లో ఒక సామాన్యమైన కుటుంబంలో 1837 ఫిబ్రవరి 5 న జన్మించాడు..నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు..అప్పటి నుండి తల్లి కష్టపడి పనిచేస్తూ భయభక్తులతో పిల్లలను పోషించేది.. కుటుంబ పరిస్థితులను బట్టి చదువుకు స్వస్తి చెప్పి పొరుగువాని ఆవులు మేపుట ద్వారా డబ్బు సంపాదించి తల్లికి సహకరించేవాడు..ఆ తర్వాత చెప్పుల వ్యాపారం లో చేరాడు..అలా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాడు.. ఆ సమయంలో ఎడ్వర్డ్ కింబెల్ అనే సండే స్కూల్ టీచర్ ద్వారా యేసును గురించి సువార్త విని, ఆత్మ రక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, పాపములను ఒప్పుకొని, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు.. రక్షణ అనుభవం గురించి మూడీ ఇలా రాసుకున్నాడు.. “నేను రక్షించబడిన ఉదయం ఇంటి నుండి బయటకు రాగా నాకు అంతా కొత్తగా కనిపించెను. సూర్యుడు మరింత తేజస్సుతో ప్రజ్వలిస్తూ నన్ను చూసి నవ్వుచున్నట్లు అనిపించెను. చెట్లమీద పక్షులు స్తుతిగీతాలు పాడుచున్నట్లు సర్వసృష్టి నా రక్షణ విషయమై ఆనందించుచున్నట్లు అనిపించెను..” ఇది మరువలేని అనుభవము.. యౌవనకాలంలో రక్షించబడిన వెంటనే ఇంత గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందించాలని ఆశించి, ప్రతి ఆదివారం వీధుల్లో తిరిగే పిల్లలను, మురికివాడల్లో నివసించే పిల్లలను సమకూర్చి మందిరానికి తీసుకుని వెళ్తుండేవాడు.. త్రాగుడు, వ్యభిచారం, ఇతర దురలవాట్లకు బానిసలుగా ఉన్న వారికి క్రీస్తును గురించి చెప్పి, వారి కొరకు ప్రార్ధించి, ప్రభువు బిడ్డలుగా వారిని మార్చేవాడు.. అలా మూడు సంవత్సరాలలో వెయ్యి మందిని సమకూర్చగలిగాడు..తర్వాత 1862లో ఏమ్మా రెవెల్ అనే కన్యను వివాహం చేసుకున్నాడు.. ముగ్గురు బిడ్డలను ప్రభు వారికి అనుగ్రహించారు..

                    చెప్పుల వ్యాపారంలో పనిచేస్తున్నప్పటికీ ఆత్మలను రక్షించాలనే భారంతో పూర్తిగా వ్యాపారాన్ని విడిచిపెట్టి, ప్రభువు మీద విశ్వాసంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పరిచర్యను ప్రారంభించి దానిని అభివృద్ధి పరిచెను.. మూడీ దేవుని సన్నిధిలో అనేక గంటలు ప్రార్ధించి, అనేక సంగతులను, వర్తమానములను ప్రభువు దగ్గర నుండి పొందుకునేవాడు.. ఒకరోజు ఇంగ్లాండ్ నుండి వచ్చిన యువకుడు యోహాను 3:16 మీద వారం రోజుల పాటు ప్రసంగించినప్పుడు మూడీ ఆశ్చర్యానికి గురై ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలని, ఎక్కువగా బైబిల్ చదవడం ప్రారంభించాడు.. అంశాలవారీగా ప్రసంగాలు సిద్ధపరుచుకునేవాడు.. ఒకరోజు ప్రసంగ చక్రవర్తి అయిన స్పర్జన్ గారు మరణించిన తర్వాత తన భార్య ఆయన ఉపయోగించిన బైబిల్ ను మూడీకి బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ బైబిల్ ద్వారా, స్పర్జన్ గారు రాసుకున్న నోట్స్ ద్వారా ఇంకా లోతైన విషయాలను ప్రసంగాలుగా తయారు చేసుకునేవాడు….

                  తరువాత Y.M.C.A లో వైస్ ప్రెసిడెంట్ గా చేరి సేవకొరకు గొప్ప గొప్ప భవనాలు కట్టించాడు..జార్జ్ ముల్లర్, స్పర్జన్ గార్లను చూడాలని అమెరికా వెళ్లినప్పుడు తనకు ప్రసంగించే అవకాశాలు అనేకం లభించాయి.. దాని ద్వారా తన పరిచర్య విస్తరించింది.. తరువాత అదే అమెరికా దేశంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సాంగి అను వ్యక్తిని సేవ కొరకు ప్రోత్సహించాడు..10 నెలల తరువాత తాను ఉద్యోగాన్ని విడిచి మూడీ గారితో కలిసి దేవుని సేవకు సమర్పించుకున్నాడు.. 1871లో మూడీ పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్ధించుట మొదలుపెట్టారు..తద్వారా ఆత్మ నిలుపుదల పొందుకుని మునుపటికంటే శక్తివంతమైన పరిచర్య చేశారు.. తర్వాత అనేక పట్టణాలు తిరిగి గొప్ప ఉజ్జీవ కూటాలు నిర్వహించారు. 50000 వేల మంది వరకు కూటాల్లో పాల్గొన్నారు.. తరువాత అమెరికాలో, న్యూయార్క్ లో ఉజ్జీవసభలు నిర్వహించినప్పుడు ఎంతోమంది వాక్యం విన్నారు, సంఘ కాపరులు ప్రోత్సహించబడ్డారు.. తద్వారా వీరి పరిచర్య అనేక దేశాలకు విస్తరించింది.. పరిచర్య విస్తరిస్తున్నా ఎలాంటి గర్వము, అతిశయము లేనివాడిగా జీవించాడు. ఒకసారి ఓ యువకుడు మీ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది రక్షించబడినారు అని అడిగినప్పుడు చిరునవ్వుతో “ప్రభువుకు స్తోత్రం, దాని గురించి నాకు తెలియదు. గొర్రెపిల్ల జీవ గ్రంథము నా దగ్గర లేదు” అని జవాబిచ్చాడు.. అలా ఎవరు ఏ ప్రశ్న అడిగినా విసుగకా జవాబు ఇచ్చేవాడు.. దారిద్ర్యము, శ్రమలు, పొగడ్తలు అనేకులను పాడుచేస్తాయి కానీ మూడీని అవి కదిలించలేకపోయాయి.. అన్ని విషయాల్లో యదార్ధంగా ఉండేవాడు. 1879 లో స్త్రీల కొరకు బైబిల్ కాలేజ్, 1881లో హెర్మోను మౌంట్ కళాశాలను, 1894 లో ఒక పత్రికను ప్రారంభించాడు.. బైబిల్ కాలేజ్ మరియు హాస్టల్ ను స్థాపించి దానికొరకు ప్రయాసపడటమే కాకుండా పేదవారైన విద్యార్థులకు తానే ఫీజు కట్టి చదివించేవారు.. వ్యాధిగ్రస్తుల అవసరాలు తీర్చేవాడు.. కుటుంబాన్ని అశ్రద్ధ చేసేవాడు కాదు. 1892 లో పాలస్తీనాకు వెళ్ళాడు.. ఒకసారి ఇంగ్లాండ్ నుండి అమెరికా పోవు ఓడలో 700 మంది తో కలిసి ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడలో ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్న వారిని ధైర్యపరిచి ప్రార్ధించగా ప్రభువు వారికి వేరొక ఓడను పంపించాడు.. చివరిగా ఈయన పరిచర్య అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు అద్భుతమైన మార్పు, ఉజ్జీవాన్ని తెచ్చింది… 1899 డిసెంబర్ 22న ప్రభువు పిలుపు అందుకున్నారు….

గొప్పపలుకు:- “ప్రపంచమంతటిని దేవుడు నాకు ఇచ్చిననూ త్రోసిపుచ్చి, పరిశుద్ధాత్మ నింపుదలను ఎన్నుకుంటాను..” అని పలికాడు….

392 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account